Jason Sanjay | ఈ మధ్య సినిమా తారలు రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొందరు పార్టీలు స్థాపిస్తుండగా, మరి కొందరు ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.టాలీవుడ్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక తమిళనాట స్టార్డం ఉన్న దళపతి విజయ్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టారు. రీసెంట్ గానే సొంత పార్టీని ప్రకటించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆయన కన్నేసి ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విజయ్ తన చివరి చిత్రం పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
దళపతి విజయ్ జన నాయగన్ అనే సినిమా చేస్తుండగా, ఈ చిత్రానికి డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తన సినీ కెరీర్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. విజయ్ సినిమాలకి వీడ్కోలు పలుకుతాడని తెలిసి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే వారికి కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే విజయ్ కొడుకు జాసన్ సంజయ్ సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతుండగా, దీనికి సంజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నిన్న సందీప్ కిషన్ పుట్టిన రోజు కావడంతో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే ఇది యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ వీడియోలో జాసన్ సంజయ్ డైరెక్షన్ చేసినట్టు మేకింగ్ విజువల్స్ ఉండటంతో మనోడిలో కసి బాగానే ఉన్నట్టు ఉందిగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ కావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విజయ్ తనయుడు డెబ్యూ మూవీపై ఇప్పుడు అందరిలో ఆసక్తి ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.