December Tollywood Movies | డిసెంబర్లో సినిమాల జాతర..బాక్సాఫీస్ షేక్ అవుతుందా..?
గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ (Tollywood)లో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ (Lovestory), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు తీసుకొచ్చాయి.

గత ఏడాదిన్నరగా కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ (Tollywood)లో పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. కాస్త పేరున్న సినిమాలు విడుదలైనా కూడా బాక్సాఫీస్ దగ్గర కోరుకున్న కలెక్షన్స్ తీసుకు రావడం లేదు. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ (Lovestory), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor) లాంటి ఒకటి రెండు సినిమాలు మాత్రమే మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. వీటిని చూసి మిగిలిన సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కరోనా సెకండ్ దశ పూర్తైన తర్వాత పెద్ద సినిమాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇన్ని రోజులు ప్రేక్షకులు వేచి చూస్తున్న దానికి డిసెంబర్ వేదికగా నిలవనుంది. ఆ నెలలో ప్రతి వారం ఒక పెద్ద సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 3న వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ పెద్దబ్బాయి అల్లు వెంకటేష్ నిర్మిస్తుండటం విశేషం.

ఇక డిసెంబర్ 17న మోస్ట్ అవైటెడ్ పుష్ప (Pushpa) విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుంది. పైగా ఇది రెండు భాగాలుగా వస్తుండడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పుష్ప మొదటి భాగం నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ 24న నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) విడుదలవుతుంది. వి, టక్ జగదీష్ సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలై అత్యంత దారుణంగా నిరాశపరిచాయి. దాంతో థియేటర్లో తన సత్తా చూపించాలి అని నాని ఎదురు చూస్తున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
మరోవైపు డిసెంబర్ 10న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న అఖండ (Akhanda)సినిమా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు. కానీ డిసెంబర్లో మిగిలిన ఏకైక డేట్ ఇదే. దాంతో ఈ సినిమాను ఆ రోజు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ అన్నీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే సంక్రాంతి సినిమాలకు అద్భుతమైన రూట్ మ్యాప్ పడినట్లే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

