తెలుగమ్మాయిలు కథానాయికలుగా నటించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఓ తెలుగుమ్మాయి కథకురాలిగా, కథానాయికగా, నిర్మాతగా మూడు బాధ్యతలను నిర్వర్తించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే సుమయారెడ్డిని ‘సూపర్’ అంటున్నాయ్ ఫిల్మ్ వర్గాలు. ‘డియర్ ఉమ’ అనే సినిమాకు ఆమె కథని అందించడమే కాక, కథానాయికగా నటిస్తూ, సినిమాను నిర్మిస్తున్నది.
పృధ్వీరాజ్ అంబర్ ఇందులో కథానాయకుడు. సాయిరాజేశ్ మహాదేవ్ దర్శకుడు. నేడు సుమయారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా ‘డియర్ ఉమ’ స్పెషల్ పోస్టర్ని, పాటను విడుదల చేశారు. ‘నీవెవరో..’ అంటూ మెలోడీగా సాగిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని సుమయారెడ్డి తెలిపారు. రథన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.