DD Next level | ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన హారర్ కామెడీ చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. తమిళ హారర్ కామెడీ ఫ్రాంచైజీ డీడీ నుంచి వచ్చిన నాలుగో చిత్రమిది. ఈ సినిమాకు ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్, ది షో పీపుల్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి, ఆర్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంతానంతో పాటు గౌతం వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, నిజల్గల్ రవి, గీతికా తివారీ, మోట్ట రాజేంద్రన్, యషికా ఆనంద్, కస్తూరి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మే 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో తెలుగులో జూన్ 13 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ కృష్ణమూర్తి (సంతానం) అనే సినీ విమర్శకుడు, యూట్యూబర్ చుట్టూ తిరుగుతుంది. తన జెన్యూన్ రివ్యూలతో కృష్ణమూర్తి యూట్యూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటాడు. అయితే ఒకరోజు కృష్ణమూర్తికి హిచ్‌కాక్ ఇరుదరాజ్ (సెల్వరాఘవన్) అనే దర్శకుడు తీసిన ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ అనే సినిమా స్క్రీనింగ్‌కు హాజరుకావాలని ప్రత్యేక ఆహ్వానం వస్తుంది. దీంతో అతను తన కుటుంబంతో కలిసి ఆ సినిమా చూడడానికి వెళ్తాడు.
అయితే తాను వెళ్లింది ఒక దెయ్యాల థియేటర్ అని, అక్కడికి వెళ్తే బయటకు రావడం అసాధ్యమని కృష్ణమూర్తికి తెలుస్తుంది. గతంలో తాను రివ్యూ ఇచ్చిన ఒక సినిమా నిర్మాత తనపై పగ తీర్చుకోవడానికే ఇలా చేశాడని గ్రహిస్తాడు. దీంతో ఆ థియేటర్ నుంచి ఎలాగైనా బయటపడాలని కృష్ణమూర్తి ప్రయత్నిస్తాడు. అయితే ఆ థియేటర్ నుంచి కృష్ణమూర్తి ఎలా బయటపడ్డాడు. అసలు కృష్ణమూర్తిని టార్గెట్ చేసిందేవరు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
This ain’t a horror movie. It’s a horror movie inside a horror movie. 😵💫🎞️
2025’s Biggest Horror Comedy Blast #DDNextLevel will be streaming from June 13th on ZEE5! @iamsanthanam @arya_offl @TSPoffl @NiharikaEnt @iampremanand @menongautham @selvaraghavan @geethika0001… pic.twitter.com/lFrri9oFfu
— ZEE5 Tamil (@ZEE5Tamil) June 10, 2025
Rewrite in telugu