MUDA Scam | ముడా కేసులో రూ.100కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..!
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు ఈ కేసులో జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
MUDA Scam | మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) స్థలాల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు ఈ కేసులో జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని.. ముడా అధికారులతో సహా పలువురు బడా వ్యక్తులకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఈ ఆస్తులు ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పటివరకు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారంగా రూ.400కోట్లుగా ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై 1860 నాటి భారత శిక్షాస్మృతి, 1988 నాటి అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మైసూర్‌లోని లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ముడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. జీటీ దినేష్ కుమార్ సహా మాజీ ముడా కమిషనర్ల పాత్ర అనర్హమైన సంస్థలు, వ్యక్తులకు పరిహారంగా స్థలాలు కేటాయించడంలో కీలక పాత్ర పోషించినట్లుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరించినట్లుగా సమాచారం.
కేసు విషయానికి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA)కి చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో కుంభకోణానికి సంబంధించింది. అయితే, వాస్తవానికి సతీమణి పార్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలోని 3.2 ఎకరాల భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ భూమిని ముడా సేకరించింది. ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి డిమాండ్ చేయడంతో ముడా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయానగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్ల ధర.. ఆమె ఇచ్చిన భూమి ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కేటాయించారని మండిపడుతున్నాయి. ఈ భూ కుంభకోణం విలువ రూ.3వేలకోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

