Jani Master | జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేశామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే పోలీసులు గురువారం అధికారిక ప్రకటన చేశారు. గోవాలో జానీని అరెస్టు చేశామని.. హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరుచనున్నట్లు చెప్పారు.
ఈ నెల 15న బాధిరాలి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. జానీపై 376(2)ఎన్, 506, 323 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 2020లో ముంబయిలో పని చేస్తున్న సమయంలో జానీ తనపై లైంగిక దాడికి పాల్పడిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొందని.. ఈ కేసులో ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం సేకరించినట్లు వివరించారు. బాధితురాలు నేరం జరిగిన సమయంలో మైనర్ అని తేలిందని.. దాంతో పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు.
Nagababu | జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్..!