సాధారణంగా హీరోయిన్లు ప్రేమలో పడటం ఆ తర్వాత బ్రేకప్ అవడం మామూలుగా జరిగే విషయమే. అన్ని భాషల హీరోయిన్లు ఈ విషయంలో మినహాయింపేమి కాదు. ఈ జాబితాలోకే వస్తుంది దంగల్ ఫేం సన్యా మల్హోత్రా (Bollywood). ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ విషయం చెప్పుకొచ్చింది బాలీవుడ్ (Sanya Malhotra) భామ. నేను నా మానసిక ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాను..నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానని చెప్పింది సన్యా మల్హోత్రా.
బ్రేక్-అప్లు అందరికీ కష్టమని నేను భావిస్తున్నా. అదే నాపై నిజమైన పనిని పెట్టింది. చివరి బ్రేకప్ (Break up) నా హృదయాన్ని కదిలించింది. నేను ఢిల్లీలో ఉన్నపుడు మొదలైన నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన, సుదూర బంధం. కానీ అవన్నీ ముగిసిన వెంటనే లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత నేను ముంబైలో ఒంటరిగా ఉన్నా. కానీ కొన్ని విషయాలు ఎందుకు వర్కవుట్ కావో తెలుసుకోవడానికి సమయం తీసుకున్నా. నా మీద నేను ఫోకస్ పెట్టాలనుకున్నా..2020 నాకు మంచి సంవత్సరం, రిలాక్సేషన్ దొరికింది. ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ కంటే ముఖ్యమైనదేం కాదని చెప్పుకొచ్చిన సన్యా మల్హోత్రా..ఇంతకీ ఆ బ్రేకప్ చేసిన వ్యక్తి ఎవరనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టింది.
సన్యా మల్హోత్రా హిట్.. ది ఫస్ట్ కేస్‌లో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 2020లో తెలుగులో వచ్చిన హిట్ చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన డాక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
ఇవి కూడా చదవండి..
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు