Rana Naidu Trailer | ముంబైలో రానా నాయుడు ట్రైలర్ వేడుక అట్టహాసంగా జరిగింది. మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే రానా నాయుడు సిరీస్ సెలబ్రిటీస్ వివాదాలపైనే నడుస్తుంది. సుందర్ ఆరోన్ లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌ను కరణ్ అన్షుమాన్ & సుపర్ణ్ ఎస్ వర్మ తెరకెక్కించారు. తాజాగా ఈ ట్రైలర్ విడుదలైంది. ఇందులో రానా, వెంకటేశ్ పోటీ పడి మరీ నటించారు. రానా ఒక అల్టిమేట్ సెలబ్రిటీ ఫిక్సర్‌గా నటిస్తుండగా.. అతని తండ్రి నాగ పాత్రలో వెంకటేశ్ నటిస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య ఓ సమస్య ఉంటుంది. ఇందులో రానా పాత్ర కంటే వెంకీ పాత్రలోనే ఎక్కువగా ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ఈ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. పైగా లుక్ కూడా అదిరిపోయింది. అన్నింటికీ మించి ట్రైలర్ చివరలో డైలాగ్ అయితే భలేగా పేలింది. నీ చిన్నపుడు ఐదేళ్ళ వరకు నేనేరా నీ ము.. కడిగింది.. నాకు తెలుసు అక్కడ ఎంత గబ్బు ఉందో అంటూ వెంకీ చెప్పిన డైలాగ్స్ తెగ నవ్వించేస్తున్నాయి.
ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూసిన తర్వాత సిరీస్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని దగ్గుబాటి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్‌కు ఇదే మొదటి వెబ్ సిరీస్. బాబాయ్ అబ్బాయి కలిసి నటించడంతో బయట కూడా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ తమకు చాలా ప్రత్యేకమైనదని.. నెట్‌ఫ్లిక్స్‌తో, బాబాయ్ వెంకీతో తన మొదటి కొలాబరేషన్ అంటూ ఈ సందర్భంగా రానా చెప్పుకొచ్చాడు. అన్న కొడుకుతో నటించడం కొత్తగా అనిపించిందని.. వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు వెంకటేశ్. అంతేకాదు తను పోషించిన నాగ పాత్ర కొత్తగా ఉందని చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ హీరో. ఈ సిరీస్‌లో సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, రాజేష్ జైస్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా నాయుడు మార్చి 10, 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో అందుబాటులో ఉండబోతుంది. మరి ఈ వెబ్ సిరీస్‌తో రానా, వెంకటేశ్ ఏ మేర మాయ చేస్తారో చూడాలి.
RRR at Oscars | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్‌ను కలిసిన చంద్రబోస్