Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj). ఎన్బీకే 109 (NBK109)గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
ఇందులో భాగంగా ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ దబిడి దిబిడి సాంగ్ లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ మాస్ బ్లాస్ట్ సాంగ్‌లో బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా కాంబోలో సాగే స్టైలిష్ మాస్ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను థమన్, వాగ్దేవి పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.
ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా..శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైశ్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
టెక్సాస్‌లోని డల్లాస్‌లో జనవరి 4న Texas Trust CU Theatreలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన హై ఎనర్జిటిక్ FIERCE Track నెట్టింట వైరల్ అవుతోంది. దబిడి దిబిడి సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి మరి.
దబిడి దిబిడి సాంగ్..
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!