మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 07, 2021 , 21:18:43

ప‌వ‌న్-రానా సినిమా క్రేజీ అప్‌డేట్‌..!

ప‌వ‌న్-రానా సినిమా క్రేజీ అప్‌డేట్‌..!

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ పవన్‌కల్యాణ్‌, రానా కాంబినేష‌న్ లో తెలుగులో రీమేక్ అవుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం షూటింగ్ జ‌న‌వ‌రి 20 నుంచి మొద‌లుకానుంది. అంతేకాదు హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో విశాల‌మైన లాడ్జ్ సెట్ ను వేస్తున్నార‌ట‌. ఫ‌స్ట్ షెడ్యూల్ లో 25 రోజుల‌పాటు చిత్రీక‌రణ జ‌రుపనుండ‌గా..ప‌వ‌న్-రానా పై వచ్చే కీల‌క స‌న్నివేశాలు షూట్ చేస్తార‌ని టాక్‌.

ప‌వ‌న్ క‌ల్యాణ్ బిజూ మీన‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా..రానా పృథ్విరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌  ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల, ఎడిటర్‌: నవీన్‌నూలి, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ. ఫీమేల్ లీడ్ రోల్స్ లో ఎవ‌రు న‌టించ‌నున్నార‌నే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి

స్నాక్స్ ఎత్తుకెళ్లిన‌ సోనాక్షిసిన్హా..వీడియో వైర‌ల్

సోషల్ మీడియాలో వ‌కీల్ సాబ్ ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌

లాక్‌డౌన్ త‌ర్వాత తొలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌..!

నీకు టాలెంట్ లేదు..మాకొద్ద‌న్నారు: నోరా ఫ‌తేహి

చిరు 'ఆచార్య' టెంపుల్ టౌన్ చూశారా..?

కిమ్‌-వెస్ట్ వైవాహిక బంధానికి తెర‌ప‌డ్డ‌ట్టేనా..?

'ఆచార్య' సిబ్బందికి సోనూసూద్‌ స్మార్ట్ ఫోన్లు గిఫ్ట్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo