Sunil Gavaskar : ‘ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం’ అని చాటుతూ సిడ్నీ వన్డేలో చెలరేగిపోయారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని.. బౌండరీల మోతతో జట్టుకు 9 వికెట్ల విజయాన్ని కట్టబెట్టారు. తమ అనుభవం జట్టుకు ఎంత అవసరమో నిరూపిస్తూ అజేయంగా నిలిచిన రోకో.. వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు సిద్ధమేనని చెప్పకనే చెప్పారు. సిడ్నీ వన్డేలో ఇద్దరి బ్యాటింగ్‌కు ఫిదా అయిన సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా సరే అనుభవజ్ఞులైన విరాట్, హిట్‌మ్యాన్ వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఆడాల్సిందేనని సన్నీ అంటున్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో అగ్ని పరీక్షను ఎదుర్కొన్న కోహ్లీ, రోహిత్ తమ బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. రెండు వన్డేల్లో డకౌట్ అయిన విరాట్.. సిడ్నీలో అర్ధశతకంతో మెరవగా, హిట్‌మ్యాన్ శతక గర్జనతో తనలో పరుగుల ఆకలి తగ్గలేదని చాటాడు. మూడో వన్డేలో వీరిద్దరి బ్యాటింగ్ చూశాక.. కచ్చితంగా వన్డే ప్రపంచ కప్‌లో అవకాశం పక్కా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. రోకో భవితవ్యంపై గవాస్కర్ కూడా పాజిటివ్ రిపోర్టు ఇచ్చాడు.
Sunil Gavaskar said🎙️ : If Rohit starts playing in a calm & composed style like this, He will score 100 in every match. He is the first guy who deserves to play 2027 WC. (7 Sports) pic.twitter.com/fHhwXyEYeg
— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 (@ImHydro45) October 25, 2025
‘ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులో ఉండడం ద్వారా తాము వరల్డ్ కప్ బరిలో ఉంటామనే సంకేతాలిచ్చారు కోహ్లీ, రోహిత్. అడిలైడ్, సిడ్నీలో రోహిత్ దంచేయగా.. సిడ్నీ వన్డేతో కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. తదుపరి సిరీస్‌లో వీరికి ఛాన్స్ వస్తుందా? రాదా? .. ఇద్దరూ రన్స్ కొడుతారా? లేదా? అనే విషయాలు అనవసరం. ఎందుకంటే.. వరల్డ్ కప్‌లో వీరిద్దరి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది. కాబట్టి.. మెగా టోర్నీ సమయానికి రోకో ఫిట్‌గా ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా స్క్వాడ్‌లోకి తీసుకోవాలి’ అని గవాస్కర్ తన మనసులోని మాట వెలిబుచ్చాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లీ, రోహిత్‌కు ప్రపంచ కప్‌తో ఘనమైన వీడ్కోలు పలకాలనే ఉద్దేశాన్ని సన్నీ వ్యక్తం చేశాడు.
18 + 45 = 💯
SCORECARD: https://t.co/tpaFfb13G7 pic.twitter.com/b1rTyqWaXN
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2025