తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. కమల్‌హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. త్వరలోనే షూటింగ్ షురూ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. విక్రమ్‌లో నలుగురు విలన్స్ కనిపించబోతున్నారన్న వార్త కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వీరిలో ఒకడు మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్..కాగా మిగిలిన ముగ్గురు కీ యాక్టర్స్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. కమల్‌హాసన్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా..ఆయన పాత్ర ఆడియెన్స్ కు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుందని టాక్. మరోవైపు ఈ పాత్రలో కీ ట్విస్ట్ కూడా ఉంటుందట. విక్రమ్ సినిమాలో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు మిగిలిన ముగ్గురు విలన్లు ఎవరై ఉంటారని తెగ ఆలోచిస్తున్నారు సినీ లవర్స్.
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com