టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్‌ఫాదర్ (Godfather). మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్ లో సల్మాన్, చిరుపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించింది టీం. కాగా ఈ సినిమాకు సంబంధించిన కీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. త్వరలోనే మెగాస్టార్ ఈ చిత్రంలో వచ్చే పాట షూటింగ్లో పాల్గొనబోతున్నాడు.
ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే సల్మాన్ ఖాన్ కూడా ఈ పాటలో మెరువబోతున్నాడట. తాజా అప్డేట్ ప్రకారం ఈ స్టార్ హీరోల పాట చిత్రీకరణ జూన్ మొదటి వారంలో ఉండనుందని టాక్. ప్రస్తుతం చిరంజీవి యూఎస్ హాలీడే టూర్లో బిజీగా ఉన్నాడు. మే చివరలో ఇండియాకు తిరిగిరానున్నాడు చిరు. ఆ తర్వాత గాడ్ ఫాదర్ షూటింగ్లో పాల్గొనబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తవగా..పాటలో కనిపించాల్సి ఉందట.
గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీ రోల్స్ పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.