కోలీవుడ్ (kollywood) స్టార్ యాక్టర్ విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar)దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ ప్రాజెక్టులో పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. బీస్ట్ చిత్రం షూటింగ్ నవంబర్ కల్లా పూర్తి కానుందని..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు డిసెంబర్ వరకు పూర్తవనున్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.
కాగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై షెడ్యూల్ పూర్తయిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం విజయ్ అండ్ నెల్సన్ టీం విదేశాలకు వెళ్లనుంది. అక్కడే మేజర్ పార్టును చిత్రీకరించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత బీస్ట్ సినిమాతో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర