Balakrishna Vs Boyapati | బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లతో ఫుల్ జోష్‌మీదున్నాడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). మరోవైపు మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కూడా అఖండతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రేజీ కాంబోలో అఖండ 2 కూడా రాబోతుందన్న మోస్ట్ క్రేజీ అప్డేట్ కూడా ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ-బోయపాటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది.. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది.. చదివింది నిజమే.
హ్యాట్రిక్ కాంబోగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో ఒకేసారి బరిలో నిలువబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బోయపాటి (Boyapati Srinu) ప్రస్తుతం రామ్ పోతినేనితో కలిసి RAPO20ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే స్టన్నింగ్ యాక్షన్ లుక్ విడుదల చేస్తూ చిత్రాన్ని దసరా సీజన్లో అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించాడు బోయపాటి. అయితే తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న ఎన్బీకే 108 (NBK 108) విడుదలపై కూడా క్లారిటీ వచ్చేసింది. విజయదశమికి ఆయుధపూజకు రెడీ అంటూ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
Rapo20
తాజా టాక్ ప్రకారం ఎన్బీకే 108 అక్టోబర్ 19 నుంచి 21 తేదీల మధ్య విడుదలయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు బాలకృష్ణ, మరోవైపు బోయపాటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకేసారి పోటీపడటం దాదాపు ఖాయమైపోయినట్టే. మరి ఈ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్‌గా నిలుస్తుంది.. బోయపాటి నెగ్గుతాడా..? బాలకృష్ణ గెలుస్తాడా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఏదేమైనా ఈ క్రేజీ ఫైట్ చూసేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Nbk 108
Meter | ప్రమోషన్స్‌లో కిరణ్ అబ్బవరం ఫుల్ బిజీ.. మీటర్ టీం ఎక్కడుందో తెలుసా..?
NBK 108 | బాలకృష్ణ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఎన్బీకే 108 రిలీజ్ టైం ఫిక్స్