Rishab Shetty | కాంతార ఫేం రిషబ్ శెట్టి (Rishab Shetty) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రిషబ్ శెట్టి నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్ (The Pride of Bharat :Chhatrapati Shivaji Maharaj). ఖడ్గం చేత బట్టిన శివాజీ మహారాజ్‌గా వీరత్వం ఉట్టిపడే లుక్‌లో కనిపిస్తూ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు రిషబ్ శెట్టి.
ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో క్రేజీ బయోపిక్‌తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. పాపులర్ కంపోజర్ ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయబోతుండగా.. ప్రసూన్ జోషి లిరిసిస్ట్‌గా పనిచేయనున్నాడు.
డైరెక్టర్ సందీప్ సింగ్- ప్రీతమ్- ప్రసూన్ జోషి కాంబోలో వస్తోన్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీని సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని 2027 జనవరి 1న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.
అపారమైన అసమానతలను అధిగమించి.. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి శాశ్వతమైన వారసత్వాన్ని సృష్టించిన యోధుడికి నివాళిగా వస్తోందని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
RISHAB SHETTY IN & AS ‘CHHATRAPATI SHIVAJI MAHARAJ’: SANDEEP SINGH SIGNS PRITAM – PRASOON JOSHI FOR THE FILM… Lyricist #PrasoonJoshi and music composer #Pritam will collaborate for the first time on #ThePrideOfBharat: #ChhatrapatiShivajiMaharaj.
Directed by #SandeepSingh, the… pic.twitter.com/lgYo4QWB4s
— taran adarsh (@taran_adarsh) February 17, 2025
BAFTA Film Awards: కాన్క్లేవ్ చిత్రానికి బాఫ్టా బెస్ట్ ఫిల్మ్ అవార్డు
Chhaava: విక్కీ కౌశల్ ఛావా కొత్త రికార్డు.. 3 రోజుల్లో 164 కోట్లు వసూల్