హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఓటమి భయంతోనే ‘ఇండియా కూటమి’ని విచ్ఛిన్నా నికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మా ట్లాడుతూ… ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ‘కకిన కూడు తినేందుకే’ తిరిగి ఎన్డీయే కూటమిలోనికి వెళ్తున్నారని ఫైర య్యారు. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తామన్నారు.