Darshan | రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan), నటి పవిత్రగౌడతోపాటు 16మందిని అరెస్ట్ చేశారని తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. తాజాగా మరో బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలు చూపుతూ దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దర్శన్ ఆరోగ్యంపై హైకోర్టు డాక్టర్ల నివేదిక కోరింది.
పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. కొన్ని నెలలుగా దర్శన్ అండ్ టీం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది.
పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
Suriya | కంగువ లాంటి సినిమా ఎవరూ చూడలేదు.. సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్