The Paradise | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) దసరా డైరెక్టర్‌తో ది ప్యారడైజ్ (THE PARADISE) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన నాని లుక్‌తోపాటు మోహన్ బాబు పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్ పోషిస్తోంది. సోనాలి కులకర్ణి ఈ చిత్రంలో నాని తల్లిగా కనిపించనుంది.
కాగా ది ప్యారడైజ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఇప్పుడొక ఆసక్తికర వార్త నాని అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఇంతకీ విషయమేంటంటే ది ప్యారడైజ్ కోసం హైదరాబాద్‌లో ఏకంగా రూ.7.5 కోట్లతో హౌస్ సెట్ వేస్తున్నారట. ఫలక్‌నుమా ప్యాలెస్‌ను గుర్తుకుతెచ్చేలా ఉండబోతున్న ఈ ఇంటిని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఈ వార్తతో నాని టీం ఈ సారి ఏదో పెద్ద ప్లానే వేసిందని తెగ చర్చించుకుంటున్నారు. ఇక డిసెంబర్ చివరికల్లా లేదా జనవరి మొదట్లో ఈ మూవీ నుంచి మరో గ్లింప్స్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందట. మరి దీనిపై రాబోయే రోజుల్లో మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ మూవీలో కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఓ వైపు బ్లాక్ బస్టర్ దసరా కాంబో రిపీట్ అవడం, మరోవైపు జెర్సీ, గ్యాంగ్ లీడర్ తర్వాత నాని-అనిరుధ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Ram Gopal Varma | చాలా కాలం తర్వాత నిజమైన రాంచరణ్‌ను చూశా.. చికిరి చికిరి సాంగ్‌పై రాంగోపాల్ వర్మ