Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విమర్శలను నిరసిస్తూ కాంగ్రెస్ గాంధీ భవన్ వద్ద ధర్నా నిర్వహించింది. ధర్నాలో దానం మాట్లాడుతూ బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ విమర్శించే నైతిక హక్కు లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం తాగ్యాలు చేసిందని.. బీజేపీ నేతల విమర్శలను ప్రజలు సహించరని చెప్పారు. రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే తన్విందర్తో పాటు బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని తెరకెక్కించింది. ప్రస్తుతం ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నది. చిత్రం సిక్కులను అవమానించారని.. తప్పుగా చూపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. చండీగఢ్‌లోని జిల్లా కోర్టు కంగనా రనౌత్‌కు నోటీసులు ఆజరీ చేసింది. న్యాయవాది రవీందర్ సింగ్ బస్సి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సిక్కుల ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సిక్కులను కించపరిచేలా చూపించడంతో పాటు సామాజికవర్గంపై అసత్య ఆరోపణలు చేశారని.. ఆమెపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ క్రమంలో కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. మరో వైపు చిత్రాన్ని నిషేధించాలని హర్యానా హైకోర్టులోనే పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద సన్నివేశాలను తొలగించాకే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కంగనా నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ఈ నెల 6న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. మూవీ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా విడుదల వాయిదాపడింది.
The ‘SANSKARI CONGRESS’ Language!
I have anything but love for Kangana Ranaut!
But Congress MLA Danam Nagendar calling her a PROSTITUTE is abhorrent, disgusting & absolutely disrespectful!
Danam who changes parties every second day, ideally shouldn’t speak about ‘Moral… pic.twitter.com/DQzn2wKegB
— Revathi (@revathitweets) September 18, 2024