‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ సుహాస్. ఈ చిత్రంలో సుహాస్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కలర్ ఫొటో మంచి సక్సెస్ అందుకోవడంతో సుహాస్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తాజాగా సుహాస్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సుహాస్ కొత్త సినిమా టైటిల్ ‘ఫ్యామిలీ డ్రామా’. మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
డార్క్ షేడ్స్ లో ఉన్న సుహాస్ డిజైన్డ్ లుక్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. మెహర్ తేజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తేజ కాసారపు, మెహర్ తేజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే సుహాస్ మరో ప్రయోగంతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
చిన్న చిన్న పాత్రల్లో నటించిన సుహాస్ కలర్ ఫొటో సినిమాతో సోలో హీరోగా మారాడు. మరి ఈ యువ నటుడు రెండో సినిమాతో ఎలా అలరించబోతున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి..
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?