 
                                                            
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) వైసీపీ, జనసేన పార్టీ (PawanKalyan) మధ్య ఎంత వైరం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రాజకీయంగా ఈ రెండు పార్టీలు పూర్తిగా భిన్న ధృవాలు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేశారు పవన్ కళ్యాణ్. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది ఇప్పుడు. దానికి కారణం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ (Bheemla Nayak).
సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక (Sankranthi race) గా జనవరి 12న విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు మరోసారి ప్రకటించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నాడు. సంక్రాంతికి రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా (RRR) కూడా విడుదల కానుంది. జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన ప్రమోషన్ కూడా వేగంగా జరుగుతుంది. అయితే ఏపీలో టికెట్ రేట్ల విషయం ఇప్పటికీ నిర్మాతలను కంగారు పెడుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న తక్కువ టికెట్ రేట్లతో భారీ సినిమాలు విడుదలైతే నష్టాలు ఖాయం.
గతంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా టికెట్ రేట్లు తక్కువగా ఉండడంతో చివరికి 5 కోట్లు నష్టపోయింది. అప్పుడు పవన్ కళ్యాణ్ పై పగ తీర్చుకోవడానికి టికెట్ రేట్లు తగ్గించారు అంటూ..ఏపీ ప్రభుత్వంపై కొందరు బహిరంగంగానే విమర్శలు కూడా చేశారు. ఇప్పటికే టికెట్ రేట్లు అక్కడ కొనసాగుతున్నాయి. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య ఏపీ ప్రభుత్వంతో ప్రత్యేక చర్చలు జరపనున్నారని ప్రచారం జరుగుతుంది. తమ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి కోరబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇక్కడే అసలు సమస్య ఉంది. ఒకవేళ రాజమౌళి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే.. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాకు కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒక సినిమాకు ఇచ్చి మరొక సినిమాకు ఇవ్వకపోవడం అనేది జరగదు. ఒకవేళ అలా చేస్తే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. మరి ఈ సందర్భంలో ఏ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
 
                            