Citadel: Honey Bunny | టాలీవుడ్ నటి సమంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’. ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ టీజర్‌తో పాటు మేకర్స్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.
ఈ సిరీస్‌ను నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ టీజర్‌ను విడుదల చేసింది. బాలీవుడ్ క్లాసిక్ మూవీ నమక్ హలాల్ సినిమాలోని రాత్ బాకీ బాత్ బాకీ అనే పాటతో ఈ టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ఇక టీజర్లో వరుణ్ ధావన్‌తో పాటు సమంత కొత్తగా కనిపిస్తుంది. కాగా.. ఫుల్ యాక్షన్ ప్యాకడ్గా సాగిన ఈ టీజర్‌ను మీరు చూసేయండి. కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read..
Rahul Gandhi: వయనాడ్ విలయ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ
Tapsee Pannu | నా భర్త టీంఇండియా కోచ్ కానీ ఎవరికి తెలియదు : నటి తాప్సీ
Srisailam | శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న చంద్రబాబు