Rahul Gandhi: వయనాడ్ విలయ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి.. తీవ్ర ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ప్రాంతాన్ని ఇవాళ రాహుల్ గాంధీ విజిట్ చేశారు. చూర్మలాలో ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. 288 మంది మృతిచెందగా, వెయ్యి మందిని రెస్క్యూ చేశారు.
వయనాడ్: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 288కి చేరుకున్నది. అయితే ప్రమాదానికి కేంద్ర స్థానమైన చూర్మలాలో ఇవాళ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పర్యటించారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెప్పాడిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బాధితులను కలుసుకున్నారు. అక్కడ నుంచి డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీకి వెళ్తున్నారు. మెప్పాడీలో రెండు రిలీఫ్ క్యాంప్‌లు ఉన్నాయి. రాహుల్, ప్రియాంకాలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ 2019లో గెలుపొందారు. ఆ తర్వాత ఈ ఏడాది ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. కానీ రాయ్‌బరేలీలో కూడా లోక్‌సభ స్థానాన్ని నెగ్గడంతో.. వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. అయితే వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ .. ఉప ఎన్నికల్లో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
ఇవాళ ఉదయం 9.30 నిమిషాలకు కన్నూర్ విమానాశ్రయంలో రాహుల్, ప్రియాంకాలు దిగారు. రోడ్డు మార్గం ద్వారా వయనాడ్ వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

