శ్రీశైలం : శ్రీశైలం(Srisailam) మల్లికార్జునస్వామిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
అనంతరం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) ను సందర్శించి కృష్ణమ్మకు జల హారతి ఇచ్చారు. అక్కడి నుంచి సున్నిపెంట నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. శ్రీశైలం క్షేత్రాన్ని దివ్యక్షేత్రంగా తయారు చేస్తామని, భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగాఉండే భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్తున్న నీటిని రాయలసీమకు మళ్లించి కరువు లేకుండా ప్రణాళిక చేసే బాధ్యత తమ దేనని అన్నారు. నీళ్లుంటే సంపాద సృష్టించవచ్చని తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్గాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల (Pulichintala) ప్రాజెక్టులు మరో రెండు, మూడు రోజుల్లో నిండుతున్నాయని తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీరు నిలువ ఉంచి నీటిని పొదుపుగా వాడుకుని సంపాద సృష్టించి రాష్ట్రానికి మేలు చేస్తానని అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలని అన్నారు.అందుకు రైతులు ఉద్యాన పంటు, పండ్లతోటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పరిశ్రమల రాక వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని వెల్లడించారు. పండించిన పంట ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లోకి వెళ్లి రైతులు బాగుపడాలంటే ముఖ్యంగా . వైసీపీ నాయకులు అడవిపందుల మాదిరిగా రాష్ట్రాన్ని సర్వనాశం చేశారని ఆరోపించారు. రాష్ట్రం కోలుకోవాలంటే మరో 5, 10 సంవత్సరాలు పడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు.