Tapsee Pannu | నా భర్త టీంఇండియా కోచ్ కానీ ఎవరికి తెలియదు : నటి తాప్సీ
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మతియాస్ బో అనే వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం తన భర్త గురించి కానీ.. తన గురించి కానీ ఎక్కడ న్యూస్ రాలేదు. తాప్సీ కూడా అతడితో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయలేదు.
Tapsee Pannu – Mathias Boe | బాలీవుడ్ నటి తాప్సీ పన్ను రీసెంట్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మతియాస్ బో అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం తన భర్త గురించి కానీ.. తన గురించి కానీ ఎక్కడ న్యూస్ రాలేదు. తాప్సీ కూడా అతడితో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయలేదు. ఈ భామ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేస్తుంది. భారత్‌ను దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తుంది. అయితే తన తాజా చిత్రం ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగష్టు 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన భర్త గురించి అడుగగా తాప్సీ సమాధానమిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
నా భర్త మథియాస్ బో అంటే తెలియని వాళ్లు ఉన్నారు అంటే కొంచెం బాధగా ఉందని తెలిపింది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మతియాస్ బో ఎవరో చాలా మందికి తెలియదు. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉండేది. అయితే తాను ఎవరు అనేది నేను కూడా చెప్పాలి అనుకోలేదు. అయితే అతడు ఒక క్రికెటర్ లేదా పెద్ద వ్యాపారవేత్త కాకపోవడం వలన జనాలకు తెలుసుకోవాలని అనిపించకపోవచ్చు. కానీ అతడు ప్రపంచంలో ఉన్న దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఒకడు అంతే కాకుండా ప్రస్తుతం ఒలింపిక్స్‌లో టీంఇండియా బ్యాడ్మింటన్ కోచ్ అంటూ చెప్పుకోచ్చింది.
ఇక తాప్సీ భర్త విషయానికి వస్తే.. మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతడు 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అలాగే 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత, 2012 మరియు 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు.
Also Read..
Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుల సేవలో ఏపీ సీఎం చంద్రబాబుWayanad
Landslides | అందుకే కేరళ మూల్యం చెల్లిస్తోంది.. వయనాడ్ విలయంపై బీజేపీ నేత విమర్శ
MP Ravichandra | ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశాం : ఎంపీ రవిచంద్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

