MP Ravichandra | ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేశాం : ఎంపీ రవిచంద్ర
MP Ravichandra | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వర్గీకరణకు మద్దతుగా గతంలో ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాశారని రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
MP Ravichandra | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వర్గీకరణకు మద్దతుగా గతంలో ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాశారని రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. తీర్పుతో మాదిగలు చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం నాటకాలు ఆడాయని, రాజకీయం చేశాయని, ఎస్సీలను మోసం చేశాయని ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక న్యాయంలో భాగంగా చూసి సంపూర్ణ మద్దతునిచ్చారని ఎంపీ తెలిపారు.
రాష్ట్ర ఏర్పాటు జరిగిన తొలి నాళ్లలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం హోదాలో స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశంలో అధికారం రాష్ట్రాలకు అప్పజెప్పడం సముచితంగా ఉంటుందని కేసీఆర్ గతంలో కోరడాన్ని ఎంపీ వద్దిరాజు ప్రస్తావిస్తూ.. అత్యున్నత న్యాయస్థానం కూడా ఇదే పేర్కొనడం హర్షణీయమన్నారు. ఇది శుభపరిణామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఎంపీ రవిచంద్ర కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
woman found dead | మహిళ సూసైడ్.. ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

