Citadel: Honey Bunny | బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ తెలుగు పాట పాడాడు. తనకు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలోని నేనే నానినే నేనీ నానినే అనే పాట చాలా ఇష్టమని అనుకుంటూ పాడి వినిపించాడు. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, టాలీవుడ్ నటి సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఈ వెబ్ సిరీస్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీతో పాటు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేసింది.
అయితే ఈ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ‘సిటాడెల్’ కు ఆఫర్ రావడంతో వెంటనే ఒకే చెప్పాను. ఈ సిరీస్‌లో యాక్షన్ సన్నివేశాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే అవి షూట్ చేస్తున్నప్పుడు డ్యాన్స్ చేసిన ఫిలింగ్ వచ్చేది. రాజ్ అండ్ డీకే చాలా అందంగా వాటిని తీర్చిదిద్దారు. వరుణ్‌తో మొదటిసారి అయిన చాలా మా కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది అంటూ చెప్పుకోచ్చింది.
వరుణ్ మాట్లాడుతూ.. సమంతతో చేయడం చాలా బాగ అనిపించింది. తాను సినీయర్ నటి అయిన అలా కనిపించలేదు. ఇక సమంత నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పాట ‘నేనే నానీనే సాంగ్. ఈగ సినిమాలోని నేనే నానినే నేనీ నానినే అనే పాట చాలా ఇష్టమని షూటింగ్ టైంలో ఈ పాటకు మనం కలిసి రీల్ చేద్దామని చాలా సార్లు సమంతను అడిగాను. అంటూ సమంత ముందు పాడి వినిపించాడు వరుణ్ ధవన్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#VarunDhawan says “Nene #Nani Nee” song from #Eega is his favourite and always asks #Samantha if he could make a reel with her on this song.pic.twitter.com/pXkG14eJmh
— Movies4u Official (@Movies4u_Officl) August 2, 2024
Also read..
Manila | మనీలాలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
Raj Tarun – Lavanya | లైవ్ డిబేట్లో ఆర్జేను చెప్పుతో కొట్టిన రాజ్‌తరుణ్ ప్రేయసి లావణ్య.. వీడియో
KTR | అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు.. సభకు తెలిపిన కేటీఆర్