Raj Tarun – Lavanya | ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లావణ్య. నటుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్తలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నటి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా తనను వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య.
అయితే ఈ వివాదం గత కొన్ని రోజులుగా జరుగుతుండగా.. ఈ ఘటనపై రీసెంట్గా రాజ్ తరుణ్ స్పందిస్తూ.. లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ప్రతిదానికి నా దగ్గర ఆధారం ఉంది. నాకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను లీగల్‌గానే వెళతాను న్యాయం జరిగే వరకు పోరాడుతా అంటూ ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పుకోచ్చాడు.
అయితే దీనిపై మాట్లాడానికి ఒక ఛానల్ లైవ్ షోకి వచ్చిన లావణ్య.. అక్కడ మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ భాషాను చెప్పుతో కొట్టింది. లైవ్‌లో ఆర్జే శేఖర్ మాట్లాడుతుండగా.. ఆ మాటలు నచ్చని లావణ్య ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి శేఖర్‌పై చెప్పు విసిరేసింది. దీంతో ఈ లైవ్‌షో రసభసగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. లావణ్యపై విరుచుకుపడుతున్నారు.
Tollywood Hero Raj Tarun’s ex-girlfriend Lavanya slapped Shekhar Bhasha on TV debate live show..#Tollywood #RajTarun pic.twitter.com/9k8TjvrqUm
— News Wala Filmy (@NewsWalaFilmy) August 1, 2024
Also Read..
VD12 | విధి అతని కోసం వేచి ఉంది.. విజయ్ దేవరకొండ VD12 లుక్‌తో రిలీజ్ టైం ఫిక్స్
Manu Bhaker | ఒలింపిక్స్‌లో సంచలనంతో పెరిగిన మను బాకర్ క్రేజ్.. 40 బ్రాండ్ల నుంచి ఆఫర్
KTR | తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు.. స్వాగతిస్తున్నామన్న కేటీఆర్