Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న హిస్టారికల్ డ్రామా ప్రాజెక్ట్ తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే ఘటనల నేపథ్యంలో విక్రమ్ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఏదో ఒక అప్డేట్తో మూవీ లవర్స్‌తోపాటు విక్రమ్ అభిమానులను ఖుషీ చేస్తున్న మేకర్స్ తాజాగా తంగలాన్ వార్ సాంగ్ (తమిళ్)ప్రోమోను విడుదల చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్, అరివు పాడిన ఈ పాట సినిమా థీమ్ ఎలా ఉండబోతుందో తెలియజేసేలా సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
తంగలాన్ను స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే తంగలాన్ నుంచి షేర్ చేసిన విక్రమ్, మాళవికా మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో తంగలాన్ ఉండనుందని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
Feel the fury of justice with #ThangalaanWarSong 🌋🔥
Thangalaane 🗡️ Releasing Today at 5PM
Watch Tamil Promo – https://t.co/yGnRwHYM1OA @gvprakash Musical 🎶#ThangalaanFromAug15#Thangalaan @Thangalaan @chiyaan @beemji @GnanavelrajaKe #StudioGreen @OfficialNeelam… pic.twitter.com/8BblBCkew6
— Studio Green (@StudioGreen2) August 2, 2024
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్‌నే నమ్ముకున్న అమీర్‌ఖాన్..!