Ramam | గోపీచంద్‌తో చిత్రాలయం స్టూడియోస్‌పై వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వేణు దోనెపూడి విశ్వం సినిమాను తెరకెక్కించారని తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. వేణు దోనెపూడి టీం నిర్మిస్తోన్న కొత్త చిత్రం రామం (RAMAM). The Rise of Akira ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
జైశ్రీరామ్ నినాదంతో ఉన్న జెండాను పట్టుకొని గుర్రపుస్వామి చేస్తూ ఉన్న లుక్ స్టన్నింగ్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. యోధుల గాథను ఆవిష్కరించే నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు మేకర్స్.
సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మాన్ని నిర్మూలించేందుకు ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి.. అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని ఆధారంగా అలనాటి రామరాజ్యాన్ని నేటి కాలానికి కనెక్ట్ చేస్తూ ఇప్పటివరకు రానట్వంటి వైవిధ్యమైన కథతో ఈ సినిమా మీ ముందుకు రానుందని చెప్పుకొచ్చారు వేణు దోనెపూడి.
ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా కనిపించబోతున్నాడని.. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కానున్నారని తెలిపారు. ఇంతకీ ఆ యంగ్ రైజింగ్ స్టార్ ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Unleashing the Warrior’s Saga 💥#RAMAM ~ The Rise of Akira
The journey begins here.Wishing you all a Happy Shri Rama Navami. 🏹
Step into the Chitralayam Cinematic Experience.@lokamanya_9 @VenuDonepudi @ChitralayamOffl #KondalJinna @vaisakhn06 #Aagaman2026 #JaiShriRam pic.twitter.com/FYfGnvAFGO
— BA Raju’s Team (@baraju_SuperHit) April 6, 2025
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి
Jaat Movie | ‘జాట్’ సెట్స్‌లో సన్నీ డియోల్‌ను కలిసిన ప్రభాస్
Ashu Reddy | తన బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన అషూ రెడ్డి.. ఆ కారణం వల్లే విడిపోయాం