Bro Daddy Movie Remake |మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రీమేక్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. కొత్త కథతో సినిమా తీస్తే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనని భావించి .. పరాయి భాషలో హిట్టయిన కథలనే నమ్ముకుంటున్నాడు. దీనివల్ల సేఫ్ గేమ్ ఆడొచ్చని భావిస్తున్నాడు. అందుకే చిరు రీమేక్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో హిట్టయిన సినిమానే ఖైదీ నంబర్ 150 పేరుతో రీమేక్ చేసి ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత స్ట్రెయిట్ తెలుగు కథలతో సైరా, ఆచార్య సినిమాలు చేశాడు. కానీ అవి తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో మలయాళ రీమేక్‌గా వచ్చిన గాడ్‌ఫాదర్‌తో సక్సెస్ దక్కించుకున్నాడు. అందుకే స్ట్రెయిట్ కథలను నమ్ముకొని సినిమాలు చేయడం కంటే రీమేక్‌లు అయితే బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే మరో మలయాళ సినిమాను రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
ఆ సినిమానే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో బ్రో డాడీ. ఇది దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్‌కు రెండో చిత్రం. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం లూసిఫర్. ఈ సినిమాలో నటించిన మోహన్‌లాల్‌తోనే బ్రోడాడీ సినిమాను తెరకెక్కించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. తాను కూడా ఒక ముఖ్య పాత్రలో నటించాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మోహన్‌లాల్ పోషించిన పాత్ర తనకు చక్కగా సరిపోతుందని చిరు భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కూడా మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కింది. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో బ్రో డాడీపై చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి ఈ సినిమా వర్కవుట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే బ్రో డాడీ సినిమాను వెంకటేశ్, రానా రీమేక్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఎవరూ స్పందించకపోవడంతో అది రూమర్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ ఈ సినిమాను రీమేక్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి నటిస్తే.. పృథ్వీరాజ్ పాత్రలో మరో మెగా హీరోతో నటిస్తాడని టాక్. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. అన్నట్టు ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ కూడా వేదాళం అనే తమిళ చిత్రానికి రీమేకే !!
Read Also:
NTR30 | పవన్ కళ్యాణ్ కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్.. తారక్ సినిమాకు వాడుతున్నారా?
విడాకుల తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత-నాగచైతన్య?
Yashodha Movie | సమంత మాస్.. రీసెంట్ టైమ్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ ‘యశోద’ చిత్రానివే..!
Project-K Movie | ప్రభాస్ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ గెస్ట్ రోల్?