Yashodha Movie | సమంత మాస్.. రీసెంట్ టైమ్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ ‘యశోద’ చిత్రానివే..!
Yashodha Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత గర్భిణి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'యశోద'. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది.
Yashodha Movie Collections | సరోగసి నేపథ్యంలో సమంత గర్భిణి పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. రిలీజ్‌కు ముందు మేకర్స్ విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాకుండా ఇటీవలే సమంత జరిపిన ప్రమోషన్లు కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. దాంతో ఈ చిత్రానికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి.
‘యశోద’ మూవీ మొదటి రోజు రూ.6.32 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇటీవల కాలంలో మీడియం బడ్జెట్ మూవీస్‌కు ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే సమంత క్రేజ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. యశోద చిత్రాన్ని పలు ఏరియాల్లో నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ.11.60 కోట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజే ఏకంగా రూ.3.10 కోట్ల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ దగ్గర సమంత స్టామినా ఏంటో నిరూపించింది. ఇలానే కంటిన్యూ అయితే ఫస్ట్ వీకెండ్లోనే ఈ చిత్రం 90% కలెక్షన్లను రికవరి చేస్తుంది.
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 12నే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

