Ram Gopal Varma In Project-K | ప్రభాస్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ ఓ కీలకపాత్రలో నటించనున్నట్లు సమచారం. ఇటీవలే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్-K మూవీలో ఓ పాత్ర కోసం RGVను సంప్రదించగా.. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నాడట. త్వరలోనే ఈయనపై సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సై-ఫై థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. దీపికాకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్లో రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.