Naga Chaitanya-Samantha | సమంత-నాగచైతన్య విడాకుల ప్రకటన కేవలం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా గతేడాది హాట్ టాపిక్ అయింది. ఎన్నో ఏళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాలుగేళ్లకే విడిపోవడంతో.. అటు ప్రేక్షకులు, ఇటు సినీ సెలబ్రెటీలు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి స్వస్తీ చెప్పారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారట. ఇక ఇటీవలే సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే నాగార్జున, నాగచైతన్య.. సమంతను కలువబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించనున్నట్లు టాక్.
‘ఏమాయ చేశావే’ సినిమాతో వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించారు. ఈ చిత్రం తర్వాత ‘మనం’, ‘ఆటోనగర్ సూర్య’, ‘మజిలీ’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే విడాకుల తర్వాత వీరిద్ధరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే అవుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వివాహా బంధానికి స్వస్తీ చెప్పిన వీరిద్దరూ ప్రొఫేషనల్ పరంగా కలిసి నటించడానికి సిద్ధంగా ఉంటామని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక వీరిద్దరూ మళ్ళీ కలిసిపోవాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా గుడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘NC22’ చేస్తున్నాడు.
ఇక సమంత ఇటీవలే ‘యశోద’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. దీనితో పాటుగా గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ చిత్రాన్ని కూడా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read also:
Sardar Movie | అప్పుడే ఓటీటీలోకి కార్తి ‘సర్దార్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Allu Arjun | అరుదైన అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి టాలీవుడ్ హీరోగా రికార్డు
Project-K Movie | ప్రభాస్ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ గెస్ట్ రోల్?
NTR30 | పవన్ కళ్యాణ్ కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్.. తారక్ సినిమాకు వాడుతున్నారా?