Chiranjeevi | దశాబ్ధాలుగా టాలీవుడ్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు చిరంజీవి, వెంకటేశ్. ఆఫ్‌స్క్రీన్‌లో వీరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ ఇద్దరూ ఒకే ప్రేమ్‌లో కనిపించడం అరుదుగా చూస్తుంటాం. తాజాగా అలాంటి స్టిల్ ఒకటి నెట్టింట షికారు చేస్తుంది.
వెంకీ, చిరు ఒకే విమానంలో ప్రయాణించారు. ప్రయాణంలో దిగిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ ఇద్దరు స్పెషల్ ఫ్లైట్‌లో ఎక్కడికెళ్తున్నారనే కదా మీ డౌటు. చెన్నైలో జరుగనున్న 80స్ యాక్టర్ల రీయూనియన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇలా కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తమ స్టైల్లో కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు నెట్టింట షేర్ చేసుకుంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేశ్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడని తెలిసిందే.
Megastar X Victory 🔥
Megastar @KChiruTweets garu and Victory @VenkyMama garu are off to Chennai to attend the 80’s Reunion today ✨
This evening will be a celebration of timeless memories with the 80’s stars coming together ❤️#MegastarChiranjeevi #VictoryVenkatesh pic.twitter.com/ANG0O9zyO2
— BA Raju’s Team (@baraju_SuperHit) October 4, 2025
Dhanush | ధనుష్ అదిరిపోయే ప్లాన్.. అప్పుడే మరో సినిమా రిలీజ్..!
Rahul Ramakrishna | ట్విట్టర్ యాక్టివిజంకు గుడ్‌బై.. వైరలవుతున్న రాహుల్ రామకృష్ణ ఎక్స్ పోస్ట్