Zebra | టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి జీబ్రా (Zebra). ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన జీబ్రా వాయిదా పడగా.. నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి పార్క్ హయత్‌లో మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సినిమా పాత్రలను రివీల్ చేస్తూ షేర్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. చిరంజీవి, సత్యదేవ్ మధ్య మంచి అనుబంధం ఉందని ప్రత్యేకించి చెప్పనసరం లేదు.
యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పుష్ప ఫేం ధనంజయ (జాలిరెడ్డి) కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే లాంచ్ చేసిన జీబ్రా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్ ప్రస్తుతం ఫుల్ బాటిల్, గరుడ చాఫ్టర్ 1 సినిమాల్లో నటిస్తుండగా.. ఫుల్ బాటిల్ చిత్రీకరణ దశలో ఉంది. గరుడ చాఫ్టర్ 1 ప్రొడక్షన్ దశలో ఉంది.
Get ready for the #ZEBRA GRAND MEGA EVENT as Megastar @KChiruTweets garu joins as the esteemed special guest ❤️🔥
📍Park Hyatt, Hyderabad from 6:00 PM Onwards 🥳#MegastarForZEBRA
In Cinemas #ZEBRAOnNov22nd pic.twitter.com/JbWIFDNYzt
— BA Raju’s Team (@baraju_SuperHit) November 11, 2024
Sivakarthikeyan | అమరన్ క్రేజ్.. నాలుగో హీరోగా శివకార్తికేయన్ అరుదైన ఫీట్.. !
Kalki 2898 AD | మరోసారి థియేటర్లలో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఎక్కడ రిలీజవుతుందో తెలుసా..?
Akira Nandan | ప్రిపరేషన్ షురూ.. గ్రాండ్ ఎంట్రీ కోసం అకీరానందన్ ట్రైనింగ్.. !
krish jagarlamudi | డైరెక్టర్ క్రిష్ ఇంట వెడ్డింగ్ బెల్స్.. ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?