Chiranjeevi | ఆన్గెపుకాయలు పండించిన చిరంజీవి.. రైతుల గురించి ఏమన్నాడంటే..
టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే..మరోవైపు టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా అభిమానులు, పాలోవర్లను పలుకరిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi konidela). తన అభిప్రాయాలను ఎప్పటికపుడు అందరితో పంచుకుంటాడు. డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవం (national farmers day)సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయగా..అది నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన పెరట్లో కాసిన ఆనపకాయను చూసి తెగ మురిసిపోయాడు చిరు.
‘పెరట్లో ఆన్గెపుకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి.. అలా ఉండేలా మనమే చూసుకోవాలి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతీ ఒక్క రైతుకు నా సెల్యూట్.. ’ అంటూ #nationalfarmersday హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు చిరంజీవి.
‘అన్నం పెట్టే రైతు పండించి ఎంత ఆనందం పొందుతాడో..అందులో ఎంతో కొంత నేను కూడా అనుభవిస్తున్నా. దానిక్కారణం నేను మా పెరట్లో నేను ఆనపకాయ విత్తనం వేశాను. అది పెద్ద పాదై ఈ రోజు రెండు ఆన్గెపుకాయలు కాసింది’ అని చెబుతూ చిరు షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

