ఇటీవలే బాలీవుడ్ (Bollywood) యువ జంట కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సన్ పోర్టులో గ్రాండ్‌గా వెడ్డింగ్ జరిగింది. అయితే తాజాగా బీటౌన్‌లో మరో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు సినీ జనాలు. తాజా అప్డేట్ ప్రకారం బాలీవుడ్ భామ రిచా చధా (Richa Chadha)ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ యాక్టర్ అలీ ఫైజల్-రిచా చధా (Ali Faizal-Richa Chadha)గత నాలుగేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. ఈ ఇద్దరు తమ రిలేషన్షిప్ ను వివాహబంధంగా మార్చుకునేందుకు రెడీ అవుతున్నారట. మరి రిచా చధా-అలీ ఫైజల్ వెడ్డింగ్ అప్ డేట్ ఎప్పుడు వస్తుంది..ఎక్కడ, ఎంత గ్రాండ్‌గా జరుగుతుందోనంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ లవర్స్. 2020లో అలనాటి తార షకీలా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన షకీలా చిత్రంలో లీడ్ రోల్ పోషించింది రిచా చధా.
ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం (Abhi Toh Party Shuru Hui Hai) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది రిచా చధా.