Shoot the Hero, Hawaii Five-0 ప్రాజెక్టులతో మంచి ఫేం సంపాదించింది అమెరికన్ నటి సమంత లాక్వుడ్. ఈ లాస్ ఏంజెల్స్ భామ ముంబైలో సందడి చేసింది. సమంత బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)ను కలిసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లకు మూడు ఫొటోలు పోస్ట్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ ప్యాంట్, వైట్ టీ షర్ట్‌లో సమంత ఛీర్ఫుల్, కలర్ ఫుల్ గా కనిపిస్తోంది సమంత. హృతిక్ రోషన్‌తో సమంత కొంతసేపు సరదాగా చిట్ చాట్ చేసింది. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నటుడిని కలుసుకోవడం ఆనందంగా, ఫన్నీగా ఉంది.
యాక్షన్ ను ఇష్టపడే పెద్ద సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది సమంత. హృతిక్ రోషన్ తన నెక్ట్స్ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలే హృతిక్ నటిస్తోన్న విక్రమ్ వేధ (Vikram Vedha) నెల షూటింగ్ పూర్తి చేసుకుంది. తమిళంలో హిట్‌గా నిలిచిన విక్రమ్ వేధను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ మరో కీ రోల్ చేస్తున్నాడు. దీంతోపాటు దీపికా పదుకొనేతో కలిసి ఫైటర్ సినిమా చేస్తున్నాడు. 2023 రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
బాలీవుడ్ స్టార్ హీరోతో హాలీవుడ్ భామ సమంత లాక్ వుడ్ చిట్ చాట్ చేయడం వెనుక ఏం సీక్రెట్ ఉందోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి దీనిపై హృతిక్కానీ, సమంత కానీ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.