టాలీవుడ్ (Tollywood) హీరో వెంకటేశ్ నటించిన దృశ్యం (Drishyam) సినిమాతో చైల్డ్ యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ నటి ఈస్తర్ అనిల్ (Esther Anil). ఈ చిత్రంలో వెంకటేశ్ చిన్నకూతురు అనుగా నటించి అందరినీ మెప్పించింది. అయితే ఇటీవల వచ్చిన దృశ్యం 2 (Drishyam 2) లో 20 ఏళ్ల కాలేజీ యువతిగా కనిపించింది. ఈ భామకు లీడింగ్ హీరోయిన్ కావడానికి అన్ని అర్హతలున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈస్తర్ అనిల్ గ్లామరస్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నీలిరంగు స్లీవ్ లెస్ బ్లౌజ్, గౌనులో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. బోల్డ్ లుక్‌లో అందాలు కనువిందు చేస్తున్న స్టిల్స్ కుర్రకారుకు, నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మలయాళంలో వచ్చిన దృశ్యం 2లో కూడా నటించిన ఈస్తర్ అనిల్. మరోవైపు థ్రిల్లర్ జోనర్లో వస్తున్న జాక్ అండ్ జిల్లో నటిస్తోంది.