తెలుగు సినీ చరిత్ర (Telugu cinema)లో ఆణిముత్యాల్లాంటి సినిమాలకు కొదవేమి లేదు. అలాంటి జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటుంది సిరివెన్నెల (Sirivennela). కళాతపస్వి కే విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంతో యూపీకి చెందిన నటుడు సర్వదామన్ డీ బెనర్జీ (Sarvadaman D. Banerjee) తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
సిరివెన్నెల మూవీలో బెనర్జీ అంధుడిగా పోషించిన పండిత్ హరి ప్రసాద్ పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బెనర్జీ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటించిన స్వయంకృషి చిత్రంలో కీలక పాత్రలో నటించాడు . చాలా ఏండ్ల తర్వాత చిరంజీవి, బెనర్జీ ఒక్క చోట చేరి సందడి చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. బెనర్జీని చిరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఇద్దరు యాక్టర్లు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్లోని నివాసంలో చిరంజీవిని కలిసినట్టు ట్విటర్ ద్వారా షేర్ చేశాడు బెనర్జీ. ఎంతో వినయం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలిగిన వ్యక్తి. చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశం కావడం సంతోషంగా ఉంది..అంటూ బెనర్జీ చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
It was such a pleasure meeting @KChiruTweets ji at his residence in Hyderabad..What a humble..sweet and down – to – earth person ❤️ pic.twitter.com/o8k5QovVSu
— Sarvadaman D Banerjee ( 😷#Staysafe ) (@ItsSarvadamanD) December 13, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ