టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అభిమానులకు పక్కా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని సినిమా షూటింగ్స్ తో తీరికలేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే ఆచార్య విడుదలకు రెడీ అయింది. మరోవైపు వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళాశంకర్, లూసిఫర్ రీమేక్‌గా వస్తున్న గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉన్నాయి. వెంకీ కుడుములతో కూడా ఓ సినిమాకు పచ్చ జెండా ఊపాడు చిరు. వీటితోపాటు బాబీ (Bobby) డైరెక్షన్లో మరో క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
చిరు 154 (Chiranjeevi 154)గా వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. బాబీ టీం హైదరాబాద్‌లో చిత్రీకరణ కొనసాగిస్తుందట. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో హై వోల్టేజీ యాక్షన్ సన్నివేశాలతో ఇవాళ్టి షూటింగ్ మొదలైందని టాలీవుడ్ సర్కిల్ టాక్. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే స్టంట్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ (Shruti Haasan)ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా..నేటి షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయినట్టు సమాచారం.
డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్లో చూపించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.