మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో మెరిసిన చిత్రం గాడ్ ఫాదర్ (God Father). పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. గాడ్ ఫాదర్‌కు విడుదలైన తొలి రోజు నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.
దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ తన హవా కొనసాగిస్తోంది. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా..? నెట్‌ఫ్లిక్స్ లో గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ సక్సెస్ ఫుల్‌గా లీడింగ్ పొజిషన్లో కొనసాగుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. గత వారం ఇండియాలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో టాప్ 10 మూవీస్‌లో 8వ స్థానంలో నిలిచింది గాడ్ ఫాదర్. ఈ జాబితాలో కాంతార హిందీ వెర్షన్ రెండో స్థానంలో నిలవడం విశేషం.
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, తాన్య రవిచంద్రన్, సునీల్ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్-సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు.
Read Also :18 Pages | నిఖిల్ 18 పేజెస్ టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..? వీడియో వైరల్
Read Also :Bedurulanka 2012 | సస్పెన్స్‌గా కార్తికేయ బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో