Sreeleela | స్పెయిన్‌లో నా సూట్‌కేస్ పోయింది.. ధమాకా జర్నీలో బెస్ట్ మూమెంట్ అదే.. శ్రీలీల చిట్‌చాట్
పెళ్లిసందD ఫేం శ్రీలీల (Sreeleela) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ధమాకా (Dhamaka). డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల మీడియాతో సినిమా విశేషాలు పంచుకుంది. ధమాకా ఎలా ఉండబోతుందో శ్రీలీల మాటల్లోనే..
రవితేజ (Ravi Teja) హీరోగా పెళ్లిసందD ఫేం శ్రీలీల (Sreeleela) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ధమాకా (Dhamaka). ఈ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల మీడియాతో సినిమా విశేషాలు పంచుకుంది. ధమాకా ఎలా ఉండబోతుందో శ్రీలీల మాటల్లోనే..
ధమాకా కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు..?
హలో గురు ప్రేమకోసమే చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ చేయాల్సింది. రైటర్ ప్రసన్నగారిని ఆ సినిమా టైంలో కలిశా.. కానీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ధమాకా స్క్రిప్ట్ విన్నాక ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా. కథ వినోదాత్మకంగా ఉండటంతో ఇందులో నేను కూడా భాగం కావాలనుకున్నా.
రవితేజ లాంటి సీనియర్ యాక్టర్‌తో పనిచేయడం ఎలా అనిపించింది.. ?
మొదట నేను చాలా నర్వస్‌గా ఫీలయ్యా. నా మొదటి సినిమా (పెళ్లిసందD) సమయంలో అందరూ ఎక్కువగా కొత్తవాళ్లే, కానీ ధమాకా సినిమాలో స్టార్‌తో పనిచేస్తు్న్నా. రవితేజగారితో పనిచేసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. రవితేజ నాకు ప్రోత్సాహాన్ని అందించి.. చాలా సౌకర్యవంతంగా పనిచేసేలా చేశారు.
రవితేజతో ఆఫ్‌స్క్రీన్ బాండింగ్ గురించి.. ?
ఆయన టైమింగ్‌తో బ్యాలెన్స్ అవుతూ.. నటించడం నాకు కొంత కష్టమైంది. అయితే రవితేజ నాకు మార్గనిర్దేశం చేసేవారు. ఆయనకు ఏదైనా సన్నివేశంలో నా హావభావాలు నచ్చితే నన్ను ప్రశంసించేవారు. రవితేజ సార్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి.. అందరికీ ఎంతో సపోర్టుగా ఉండేవారు.
ధమాకాలో రవితేజ పోషించిన రెండు పాత్రలు మీకు నచ్చినట్టున్నాయి..?
సినిమాలో ఇది ఒక ట్విస్ట్ లాంటిది. నా పాత్ర పేరు ప్రణవి. ఈమె రవితేజ పోషించిన రెండు పాత్రలతో ప్రయాణిస్తుంది. మధ్యలో కొంత అయోమయం. ఫైనల్‌గా ప్రణవి ప్రయాణం ఇద్దరిలో ఎవరితో ముగుస్తుందనేది కొంత సస్పెన్స్ తో సాగుతుంది.
ధమాకాలో బెస్ట్ మూమెంట్స్ ఏంటి.. ?
స్పెయిన్‌లో జింతాక్ జింతాక్ పాటను షూట్ చేస్తున్నపుడు నా కాస్ట్యూమ్స్ సూట్‌కేసు మిస్సయింది. కొంత ఆందోళనతో ఈ విషయాన్ని నా టీంకు చెప్పాను. ఆ తర్వాత డైరెక్టర్, డీవోపీ షాపింగ్ కోసం రెండుమూడు గంటలు ప్రయాణం చేశారు. ధమాకా ప్రయాణంలో క్యూట్ మూమెంట్ ఇదే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

