శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 12:26:16

చిరు బ‌ర్త్‌డే: 65 మంది ప్రముఖులచే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

చిరు బ‌ర్త్‌డే: 65 మంది ప్రముఖులచే మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా సోష‌ల్ మీడియా చుట్టే తిరుగుతుంది. సినిమాల‌కి సంబంధించిన టీజర్స్‌, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్స్ సోష‌ల్ మీడియాలో రికార్డుల దుందుభి మోగిస్తున్నాయి. కొత్త‌గా హీరోల పేరిట బర్త్‌డే హ్యాష్ ట్యాగ్‌లు క్రియేట్ చేయ‌డం, కామ‌న్ డీపీలు రూపొందిచ‌డం వాటి పేరిట ఎన్ని రికార్డులు న‌మోద‌వుతున్నాయ‌ని లెక్క‌లు వేసుకోవ‌డం జ‌రుగుతూ వ‌స్తుంది. ఈ రోజు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హెచ్‌బీడి మ‌హేష్‌బాబు హ్యాష్ ట్యాగ్ పేరిట 35 మిలియ‌న్ ట్వీట్స్ వ‌చ్చాయి. ఇండియా ప‌రంగా ఇదే రికార్డ్ అని తెలుస్తుంది.

అయితే ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న బ‌ర్త్‌డే డీపీని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు . ఇందులో భాగంగా  భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుండి 65 మంది ప్రముఖ ప్రముఖులు మెగాస్టార్ పుట్టినరోజు కామన్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. ఇండియాలో ఇదే తొలిసారి అంటూ ఓ మోష‌న్ పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే కామన్ మోషన్ పోస్టర్ ఏ రోజు విడుద‌ల చేస్తార‌నే దానిపై త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాలు ప్ర‌క‌టించ‌నున్నారు. 


logo