Chiranjeevi and Nani | ఈ ఒక్క ఫోటో చాలు.. క్యాప్షన్స్ అవసరం లేదు.. తెలుగు సినిమా చరిత్రను మార్చిన హీరో ఒకరైతే.. ఆయన స్ఫూర్తితో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలన విజయాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో మరొకరు. ఇద్దరికీ ఇద్దరే నటనలో ఎవరికి వారే సాటి. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఈ ఇద్దరూ అవలీలగా పోషిస్తారు. నవరసాలు తమ నవనాడుల్లో జీర్ణించుకున్నారు. అలాంటి ఇద్దరు ట్రూ సూపర్ స్టార్స్ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.
చిరంజీవి, నాని.. ఈ ఇద్దరికీ ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా చూసిన చిరంజీవి అతడిని ప్రత్యేకంగా కలిసి అభినందించాడు. గతంలో కూడా చాలాసార్లు నాని నటించిన సినిమాలకు మెగాస్టార్ మెప్పు వచ్చింది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నానిని చూసి చాలా గర్వపడుతుంటాడు చిరంజీవి. ఇది చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా. సొంతంగా ఎదిగిన నటులు అంటే తనకు చాలా ఇష్టమని చాలా సార్లు చెప్పాడు చిరంజీవి. అందుకే రవితేజను అంతగా ప్రేమిస్తాడు ఈయన. ఆ తర్వాత నాని అంటే కూడా మెగాస్టార్ కు అంటే ఇష్టం.
♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc
— Nani (@NameisNani) January 20, 2022
ఎప్పుడు టైం దొరికినా కూడా ఇద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా శ్యామ్ సింగరాయ్ చూసిన తర్వాత నాని నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు చిరంజీవి. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 28 కోట్ల షేర్ వసూలు చేసి భారీ లాభాలు తీసుకొచ్చింది. ఈ మధ్యే రామ్ చరణ్ కూడా ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు చిరంజీవి కూడా నాని సినిమా చూసి మెచ్చుకున్నాడు. ఏదేమైనా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఇద్దరు స్టార్ హీరోలను.. ఒకే ఫ్రేమ్ లో చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
మెగా హీరో వరుణ్ తేజ్‌తో పెళ్లి వార్తలు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..