Allu Arjun | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6.40 గంటలకు విడుదలయిన విషయం తెలిసిందే. జైలు నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బన్నిని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న టాలీవుడ్ రచయిత చిన్ని కృష్ణ బన్నీ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారని చిన్ని కృష్ణ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. అల్లు అర్జున్ వెనకాల ఒక కుటుంబం ఉంది, అల్లు అర్జున్ వెనకాల చిరంజీవి అనే ఒక మహా శక్తి ఉంది అంటూ చిన్ని కృష్ణ తెలిపాడు.
అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారు – గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ pic.twitter.com/hX1jKuqVFM
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
Also Read
Allu Arjun | అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు.. వీడియోలు
Allu Arjun | అల్లు అర్జున్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగం.. వీడియో
Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్