Chandu Champion | బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్’ (Chandu Champion). బజరంగీ భాయిజాన్, ఏక్ థా టైగర్ (Ek Tha Tiger) చిత్రాల ఫేమ్ కబీర్‌ఖాన్ (Kabhir khan) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పారాలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారతదేశం నుంచి మొట్ట మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు దర్శకుడు కబీర్ ఖాన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మించగా.. శ్రేయాస్ తల్పాడే, రాజ్‌పాల్ యాదవ్, విజయ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ALso read..