కుందనపు బొమ్మ (Kundanapu Bomma)సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ రోల్లో మెరిసింది చాందినీ చౌదరి (Chandini Chowdary). ఈ వైజాగ్ బ్యూటీ కంటెంట్ ఓరియెంట్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2020లో కోవిడ్ ప్యాండమిక్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజైన కలర్ ఫొటో సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది.
ఈ వైజాగ్ సుందరి రీసెంట్గా కిరణ్ అబ్బవరంతో కలిసి సమ్మతమే (Sammathame)అందరినీ పలుకరించింది. ఈ మధ్య కాలంలో నెట్టింట్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటోన్న చాందినీ తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టిల్స్ తో కుర్రకారు మతులు పోగొడుతోంది. యెల్లో కలర్ కాస్ట్యూమ్స్ లో జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో ‘కుందనపు బొమ్మ’లా కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచేస్తుంది. ఇపుడీ ఫొటోలు ఆన్ లైన్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
కలర్ ఫొటో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన నేపథ్యంలో చాందినీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. చాందినీ ప్రస్తుతం గామి అనే చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.